ఆస్ట్రేలియా పై బంగ్లాదేశ్ సంచలన విజయం, టెస్టు క్రికెట్‌లో నయా చరిత్ర..!!
టెస్టు క్రికెట్ లో బంగ్లాదేశ్ కొత్త చరిత్ర లిఖించింది. తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై కంగారూలను బంగ్లాదేశ్ మట్టికరిపించింది. ఇది బంగ్లాదేశ్ కు అతి పెద్ద విజయం. ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్‌కు టెస్టు క్రికెట్‌లో ఇదే తొలి విజయం. 23 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్ ఆడుతున్న బంగ్లాదేశ్.. ఆతిథ్య జట్టుకు గట్టి షాకిచ్చింది. ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో.. ఇప్పుడు ఆసీస్ కు ఘోర పరాభవంగా విశ్లేషణలు మొదలయ్యాయి.
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కొత్త రికార్డు నమోదు చేసింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ డార్విన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 57 పరుగుల స్వల్ప లక్ష్యంలో బరిలోకి దిగిన బంగ్లా 1 వికెట్ కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. 23 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్ ఆడుతున్న బంగ్లాదేశ్.. ఆతిథ్య జట్టుకు గట్టి షాకిచ్చింది. ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదటి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే ఆలౌటైన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో కాస్త ప్రతిఘటన చూపించింది. కామెరాన్ గ్రీన్ అద్భుతమైన సెంచరీతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 284 పరుగులు చేయగలిగింది. దీంతో బంగ్లాదేశ్ ముందు కేవలం 57 పరుగుల లక్ష్యం నిలిచింది. స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు.

ఆసీస్ గడ్డ పై చారిత్రక విజయంతో
అయితే.. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 426 పరుగులు చేసింది. ఓపెనర్ తంజిద్ హసన్ 101 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా, నజ్ముల్ హొస్సేన్ శాంటో, మెహిదీ హసన్ మిరాజ్ తదితరులు కూడా రాణించారు. దీంతో బంగ్లాదేశ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 228 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. కాగా, ఈ మ్యాచ్‌లో బంగ్లా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో హసన్ మహ్మూద్ 6 వికెట్లు పడగొట్టగా, రెండో ఇన్నింగ్స్‌లో మెహిదీ హసన్ మిరాజ్ 5 వికెట్లు తీశాడు. బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో రాణిస్తూ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన బంగ్లా, క్రికెట్‌లో అతి బలమైన ఆసీస్‌ను ఓడించింది. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. రెండు టెస్టుల సిరీస్‌లో తాజా విజయంలో బంగ్లా 1-0తో లీడ్ లో నిలిచింది.












Click it and Unblock the Notifications