వేల సంఖ్యలో అమాయకుల బలి
కాబూల్‌ః అఎn్గానిస్తాన్‌పై అమెరికా గత మూడు రోజులుగా సాగిస్తున్న దాడుల్లో వేలాది మంది అమాయక పౌరులు మరణించినట్టుగా తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం జరిగిన దాడుల్లో మృతుల సంఖ్య భారీగా వున్నట్టుగా తాలిబన్ల ప్రతినిధి ఒకరు తెలిపారు..
అయితే ఏయే ప్రాంతాల్లో ప్రాణనష్టం భారీగా వున్నదోవివరాలు వెల్లడించలేదు. బుధవారం పగలు కూడా కాందహార్, మజారే షరీఫ్, కాందహార్ పట్టణాలపై అమెరికా బాంబు దాడులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. దాడులు నిర్ధిష్ట లక్ష్యాలపై మాత్రమే సాగుతున్నాయని అమెరికా ప్రకటిస్తున్నప్పటికీ అనేక పౌర ప్రాంతాలపై కూడా దాడులు కొనసాగుతున్నాయని తాలిబన్లు ఆరోపించారు.విచక్షణరహితంగా అమెరికా బాంబులు, క్షిపణులతోవిరుచుకు పడుతున్నదని వారు పేర్కొన్నారు. ఇందుకు అమెరికా తగిన మూల్యం చెల్లించడం ఖాయమని వెల్లడించారు












Click it and Unblock the Notifications