1450 కోట్లతో ఐడిపిఎల్ పునరుద్ధరణ
న్యూఢిల్లీః ఖాయిలా పడిన ప్రభుత్వరంగ సంస్థ ఐడిపిఎల్‌ను 1450 కోట్ల రూపాయల భారీ వ్యయంతో పునరుద్దరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే సంస్థ ప్రైవేటీకరణకు సంబంధించి కూడా కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వం ఖరారు చేసింది.
ప్రధాని వాజ్‌పేయి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సుమారు 500 కోట్ల రూపాయల మేర వున్న ఐడిపిఎల్ రుణాలనుఈక్విటీలుగా మార్చాలని, కేంద్రప్రభుత్వానికి చెల్లించాల్సిన వడ్డీ, అపరాధరుసుము, పూచీకత్తుల బకాయిలను మాఫీ చేయాలని నిర్ణయించారు. ఐడిపిఎల్‌ను మొత్తంగా కాకుండా వివిధ యూనిట్లను ఎక్కడికక్కడే ప్రైవేట్ పరం చస్తారు. ఐడిపిఎల్ యూనిట్లు హైదరాబాద్,రిషీకేష్, గురాగావ్‌ల్లో వున్నాయి. ప్రాణరక్షకు అవసరమైన యాంటీబయోటిక్ ఔషధాలను తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసేందుకు ఏర్పాటు చేసిన ఐడిపిఎల్ యాజమాన్య లోపాలతో ఖాయిలా పడిఅప్పుల పాలై మూతపడిన విషయం విదితమే.












Click it and Unblock the Notifications