భారత్ ఆర్ధికరంగానికి యుద్ధం కష్టాలు
నెల్లూరుః ఉగ్రవాదంపై అమెరికా ప్రారంభించిన యుద్ధం భారత ఆర్థిక వ్యవస్థపై గణనీయంగానే ప్రభావం చూపుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా వ్యాఖ్యానించారు. నిన్నటి వరకు యుద్ధం ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఏ మాత్రం వుండదంటూ బింకాలు పలికిన యశ్వంత్ సిన్హా బుధవారం నెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమంలో వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఎగుమతులు, విమానయానం, టూరిజం తదితర రంగాలపై యుద్ధం దుష్ప్రభావం పడుతుందని అన్నారు.
అయితే యుద్ధం ప్రభావం ఆందోళకర స్థాయిలో భారత్ పై వుండదని ఆయన అన్నారు. ఎగుమతులరంగంపై మాత్రం యుద్ధం ప్రభావం అధికంగానే వుంటుందని యశ్వంత్ తేల్చి చెప్పారు. అదృష్ట వశాత్తు చమురు ధరలు అదుపులో వున్నాయని, ఇవి కూడా పెరిగితే పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారే ప్రమాదం వున్నదని ఆయన చెప్పారు. అంతంత మాత్రంగా వున్న భారత ఆర్థిక వ్యవస్థపై యుద్ధం ప్రభావం తీవ్రంగానే వుంటుందని ఆర్థిక రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.












Click it and Unblock the Notifications