పిసిసి నేత ఢిల్లీ యాత్ర
న్యూఢిల్లీః రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నేత సత్యనారాయణరావు మరోసారి బుధవారం నాడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ సారి ఎట్టిపరిస్థితిలోనూ జిల్లా కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులు, కార్యదర్శుల జాబితాతోనే తిరిగివస్తానని ఆయన తన సహచరులకు గట్టిగా చెప్పినట్టు తెలిసింది.
ఇప్పటికి ఆయన ఈ పనిమీద ఢిల్లీకి కనీసం పదిసార్లు వెళ్లివుంటారు. వెళ్లడానికి ముందు జాబితాతోనే వస్తానని చెప్పడం ఉత్తచేతులతో, బిక్కమొహంతో రావడం, ఆయనకు ఆయన్ను అలా చూడ్డం ఆయన సహచరులకు అలవాటయింది. అయితే ఈ సారి అలాకాదని ఆయనఅంటున్నారు. ముందుగానే అధిష్టాన వర్గం నేతలతో గట్టిగా మాట్లాడి జాబితా ఖరారు చేయించానని ఆయన చెప్పుకుంటున్నారు.విశాఖ, చిత్తూరు, ఖమ్మం వంటి వివాదాస్పద జిల్లాలుమినహా మిగిలిన జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు నియామాకం ఈ నెలాఖరు కల్లా ఎట్టిపరిస్థితిలో పూర్తయితీరుతుందని ఆయనఅంటున్నారు.












Click it and Unblock the Notifications