నో ఫ్లై జోన్‌గా తిరుమల
హైదరాబాద్‌ః తిరుమల కొండ గగనతలంలో విమానాల రాకపోకలను నిషేధించాలని కోరుతూ కేంద్రానికి ఒక లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఉగ్రవాదుల ముప్పు వున్న రాష్ట్రంలోని ముఖ్యప్రాంతాలు, కేంద్రాల భద్రతకు చేపట్టాల్సిన చర్యలపై ఆయన మంగళవారం నాడు అత్యున్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. త్రివిధ దళాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఈ సందర్భంగాఆదేశించారు.
తిరుమల-తిరుపతి దేవస్థానానికి సుబ్రహ్మణ్యం కమిటీ సూచించిన మేరకు రక్షణ చర్యలు చేపట్టాలని ఈ సమావేశం నిర్ణయించింది. జంటనగరాల ప్రజలందరికీ ఫోటో ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని ప్రధాన కూడళ్లు, నగరంలోకి ప్రవేశించే మార్గాల్లో క్లోజ్డ్ సర్క్యూట్ టీవీలను అమర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications