టెర్రరిజం పై జార్జ్ సమరభేరి
న్యూఢిల్లీఃటెర్రరిజాన్ని నిర్ధాక్షిణ్యంగా అణిచివేయలానిభారత్ కృతనిశ్చయంతో వున్నదని రక్షణమంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ ప్రకటించారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన పోరాటంలో తాము అన్నిరకాల అవకాశాలను ఉపయోగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
రక్షణ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా ఆయన విలేకరుల సమావేశంలో మంగళవారం నాడు మాట్లాడారు. టెర్రరిజాన్ని అణిచివేసే క్రమంలో ప్రభుత్వం ఎంతటి చర్యకైనా సిద్ధంగావున్నదని ఆయన స్పష్టం చేశారు.అందులో భాగంగానే సోమవారం నాడు పాకిస్తాన్ బంకర్లపై భారత దళాలు దాడిజరిపాయని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ భూభాగంలో శిక్షణ పొందిన టెర్రరిస్టులే భారత్‌లో విధ్వంసం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. సరిహద్దుల గుండా తీవ్రవాదులు దేశంలోకి చొరబడటాన్ని నిరోధించడంలో నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించాలనిసైన్యాన్ని ఆదేశించినట్టుగా ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications