పాక్‌ సైనిక స్థావరాలపై భారత్‌ దాడి

జమ్మూ: జమ్మూ కాశ్మీర్‌లోని ఆధీన రేఖ వెంబడి పాకిస్థాన్‌సైనిక స్థావరాలపై సోమవారం రాత్రి భరతా బలగాలుపెద్ద యెత్తున దాడి చేశాయి. మంధర్‌, ఆఖ్నూర్‌సెక్టార్లలో చొరబాట్లకు ప్రయత్నించిన ఉగ్రవాదుల్లో 12 మందిని కాల్చి చంపాయి. భారత్‌ దాడుల్లో 11 పాకిస్థాన్‌సైనిక స్థావరాలు నేలమట్టమయ్యాయని న్యూఢిల్లీలోని రక్షణ శాఖ ప్రతినిధి చెప్పారు. ఉగ్రవాదులతో పాటుపెద్ద యెత్తున ఆయుధాలను జమ్మూ కాశ్మీర్‌లోకి తరలించడానికి పాక్‌సైన్యం చేసిన ప్రయత్నాలను విజయవంతంగా తిప్పికొట్టగలిగామని ఆయన చెప్పారు. సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన ఈ దాడులు రాత్రి పది గంటల వరకు కొనసాగాయి. అఖ్నూర్‌సెక్టార్‌లో పాక్‌ పేలుడు పదార్థాలు అమర్చిందని ఆ ప్రతినిధి అన్నారు.

జమ్మూ డివిజన్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్‌ దళాలు భారీ స్థాయిలో కాల్పులకు పాల్పడ్డాయి. ఈ కాల్పుల్లో సాధారణ పౌరుడు ఒకరు మరణించినట్లు భారతసైనిక వర్గాలు చెప్పాయి. అనేక సెక్టార్లలో ఇరు పక్షాల మధ్య చెదురుమొదురు కాల్పులు జరిగినట్లు సమాచారం.

ఎటువంటికవ్వింపు లేకుండానే భారత్‌ దాడులకు పాల్పడుతోందని పాక్‌ ఆరోపించింది. ఈ దాడుల్లో ఒక మహిళ మరణించిందని, 25 మంది సాధారణ పౌరులు గాయపడ్డారని చెప్పింది. భారత్‌ ఆధిపత్య ఉగ్రవాదాన్ని మానుకోవాలని పాక్‌ డిమాండ్‌ చేసింది. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని రెండుసెక్టార్లపై భారత దళాలు దాడులు చేశాయని పాక్‌సైనిక ప్రతినిధి మేజర్‌ జనరల్‌ రషీద్‌ ఖురేషి ధృవీకరించారు.కవ్వింపు లేకుండానే జరిగిన ఈ దాడులకు సాధారణ పౌరులు బలయ్యారని, ఈ పరిణామాలను ప్రపంచం గమనించాలని ఆయన అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంగా భారత్‌ను ప్రకటించాలని ఆయన ఐక్యరాజ్యసమితికి, అమెరికాకువిజ్ఞప్తి చేశారు.

ఎల్‌ఒసి వద్ద ఉద్రిక్తత గురించి తెలిసిన వెంటనే అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌ సంయమనం పాటించాలని ఉభయ దేశాలకువిజ్ఞప్తి చేశారు. అఎn్ఘానిస్థాన్‌ పరిణామాల నేపథ్యంలో భారత్‌, పాక్‌ల మధ్య ఘర్షణ తీవ్ర పరిణామాలకు దారి తీసే ప్రమాదం వున్నదని ఆయన వైట్‌హౌస్‌ వద్దవిలేకరులతో అన్నారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడం కూడా ప్రస్తుతం ఆ ప్రాంతంలో పర్యటిస్తున్న తమ విదేశాంగ మంత్రి కొలిన్‌ పావెల్‌ బాధ్యతల్లో ఒకటని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+