పాక్ సైనిక స్థావరాలపై భారత్ దాడి
కాబూల్‌పై అమెరికా తాజా దాడులు
కాబూల్: అమెరికా జెట్ విమానాలు తాజాగా మంగళవారం తెల్లవారుజామున కాబూల్‌పై దాడి చేశాయి. నగరం శివార్లలోఫైటర్ జెట్లు కనీసం మూడు బాంబులు వేశాయని స్థానికులు చెబుతున్నారు. తాలిబాన్ బలగాలువిమాన విధ్వంసక క్షిపణులను ప్రయోగించాయి.
అమెరికావిమానాలు భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారు జామున నాలుగున్నర గంటల ప్రాంతంలో బాంబులు కురిపించడం ప్రారంభించాయి. కాబూల్‌కు ఉత్తరంగా వున్ తాలిబాన్‌సైనిక స్థావరాలపై ఈ దాడులు జరిగినట్లు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో ముందుక సాగడానికి నార్తర్న్ అలయెన్స్ బలగాలకు కష్టంగా వుంది.
సోమవారంనాడు అమెరికా విమానాలు పెద్ద యెత్తున బాంబుల వర్షం కురిపించాయి. కాబూల్‌లో సోమవారం డజన్‌కుపైగా పేలుళ్లు సంభవించాయి. అమెరికా బలగాలు ప్రతిరోజూ తాలిబాన్ బలగాలపై దాడులు చేస్తున్నాయని అమెరికా రక్షణ శాఖ మంత్రి డోనాల్డ్ రమ్స్‌ఫీల్డ్ చెప్పారు.












Click it and Unblock the Notifications