కల్తీసారా తాగి 25 మంది మృతి
న్యూఢిల్లీః దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని నొయిడాలోని 31వసెక్టార్‌లో వున్న నీతారి గ్రామంలో కల్తీసారా తాగి 25 మంది మరణించారు. మరో 30 మంది తీవ్రఅస్వస్థతతో ఆస్పత్రి పాలయ్యారు. సోమవారం రాత్రి ఈవిషాదసంఘటన జరిగింది.
పోలీసులు దుకాణంలో పనిచేస్తున్న కొందరు కార్మికులనుఅరెస్టు చేశారు. పోలీసులు సంఘటన వివరాలు తెలుసుకుని వెళ్లేలోపునే కొందరు మృతులకు అంత్యక్రియలను కూడా వారి బంధువులు నిర్వహించారని తెలిసింది. అధికారికంగా మృతుల సంఖ్య 13 వున్నట్టుగా పోలీసులు చెబుతున్నప్పటికీ పాతికపైనే వుంటుందని స్థానికులుఅంటున్నారు. మృతుల్లో అత్యధికులు నిరుపేద కూలీలు. చౌకగా లభించేసారాపై కార్మికులకున్న మోజును చూసి దుకాణం యజమాని కల్తీసారాను విక్రయించివుంటాడని పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications