అఎn్గాన్ జిహాద్‌కు పాక్ రిక్రూట్‌మెంట్
ఇస్లామాబాద్‌ః అఎn్గాన్‌పై అమెరికా సాగిస్తున్న దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నపాకిస్తాన్ మతఛాందస పార్టీలు ప్రదర్శనలకు మాత్రమే పరిమిత కాకుండా అఎn్గాన్‌లో తాలిబన్లకు అండగా జిహాద్ సాగించడానికి రిక్రూట్‌మెంట్ ప్రారంభించాయి.
ముఖ్యంగా వాయువ్య సరిహద్దు రాష్ట్రంలో అనేక ఇస్లాం పార్టీలు ఈ పనిని బహిరంగంగానే నిర్వహిస్తున్నాయి.అఎn్గానిస్తాన్‌లోని పుష్తూ తెగకు చెందినవారితో వాయువ్య సరిహద్దు రాష్ట్రాల్లోని గిరిజనులకు సంబంధ బాంధవ్యాలు చిరకాలంగా వున్నాయి.వీటిని ఉపయోగించుకుని యువకులను రెచ్చగొట్టడానికి మతోన్మాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.
పాకిస్తాన్‌లోని ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న అమెరికా వ్యతిరేక ప్రదర్శనలను ముషారఫ్ ప్రభుత్వం అణిచివేయగలుగుతున్నా వాయువ్య సరిహద్దు రాష్ట్రంలో మాత్రం నిస్సహాయ స్థితిలో వుంది. ఈ రాష్ట్రంలోని గిరిజన తెగల ప్రజలు తమ నేతలు చెప్పినట్టు మాత్రమేవింటారు. సుమారు ఎనిమిదివేల మంది జిహాదీలు భూతల పోరు ప్రారంభమైన వెంటనేఅఎn్గాన్‌లోకి ప్రవేశించి అమెరికా సేనలతో పోరాడేందుకు సన్నద్ధంగా వున్నారు.












Click it and Unblock the Notifications