ఢిల్లీలో కొలిన్ పావెల్
న్యూఢిల్లీః అమెరికా విదేశాంగ మంత్రి కొలిన్ పావెల్ మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో ఆయన విదేశాంగ మంత్రి జస్వంత్‌తో చర్చలు జరుతారు. పాకిస్తాన్ అధినేత జనరల్ ముషారఫ్‌తో మంతనాలు జరిపి ఢిల్లీ వచ్చిన పావెల్, అఎn్గాన్ యుద్ధానికి భారత్ సహకారాన్ని కోరడానికి వచ్చారు.
అఎn్గాన్ యుద్ధంలోకి కాశ్మీర్ వ్యవహారాన్ని లాగకుండా పాకిస్తాన్, భారత్‌లకు నచ్చజెప్పే కార్యంపై పావెల్ ఉపఖండానికి వచ్చారు. పాకిస్తాన్‌విషయంలో తమ ఓపిక నశిస్తున్నదని భారత ప్రధాని వాజ్‌పేయి ఈ మధ్యనే అమెరికా నేత జార్జ్‌బుష్‌కు స్పష్టం చేసిన నేపథ్యంలో పావెల్ ఢిల్లీ పర్యటనకువిశేష ప్రాధాన్యత వుంది. పాకిస్తాన్ విషయంలో తమ భారత్ దృఢవైఖరిని చాటేందుకే సోమవారం రాత్రి భారత్ పాకిస్తాన్ బంకర్లను విధ్వంసం చేసింది. భారత్ దాడులు జరిపిన సమయంలో పావెల్ పాకిస్తాన్‌లోనే వున్నారు. మంగళవారం నాడు ఆయన జస్వంత్‌తో మాత్రమే చర్చలు జరుపుతారు. బుధవారం నాడు ప్రధాని వాజ్‌పేయి, హోం మంత్రి అద్వానీ, ప్రతిపక్షనేత సోనియాగాంధీతో చర్చలు జరుపుతారు. పాకిస్తాన్‌విషయంలో భారత్ తన అభిప్రాయాన్ని విస్పష్టంగా ఆయనకు వెల్లడించే అవకాశం వుంది.












Click it and Unblock the Notifications