రాజమండ్రిలో ఉన్మాది ఘాతుకం

రాజమండ్రిః రాజమండ్రిలో ఉన్నాద స్థితిలో వున్న ఒక యువకుడు మంగళవారం పట్టపగలు నడిరోడ్డుపై స్వైరవిహారం చేసి ఇద్దరిని కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. ఈ ఉన్మాది దాడిలో మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. బాగా రద్దీగా వుండే కుమార్‌ టాకీస్‌, శ్యామలా టాకీస్‌ సెంటర్లలో సుమారు గంటసేపు ఈ ఉన్మాది బీభత్సం సృష్టించినట్టు స్థానికులు వెల్లడించారు.ె

చతిలో కత్తితో చెలరేగిపోతున్న ఉన్మాదిని నిలువరించేందుకు స్థానికులు రాళ్లతో తీవ్రంగా కొట్టారు.అపస్మారక స్థితిలో ఆ యువకున్ని పోలీసులు అరెస్టు చేసి తీసుకుపోయారు.తొలుత ఈ ఉన్మాది గోదావరి రోడ్‌ కమ్‌ రైలు బ్రిడ్జి వద్దకు వెళ్లి అక్కడ వెదురు నిచ్చెనలు తయారు చేసుకునే ఆకుల రాము అనే వ్యక్తి వద్దకు వెళ్లి అతనినుంచే కత్తి లాక్కుని నాలుగుసార్లు బలంగా నరికినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు.

ఈ దాడిలో రాములు అక్కడికక్కడే మరణించాడు. ఆ తర్వాత అక్కడికి సమీపంలోని దేవాలయంలో కొబ్బరికాయలు అమ్ముకుంటున్న దాసరి నారాయణరావు అనే వ్యాపారిపై దాడి చేసి నరికి చంపాడు. ఆ తర్వాత దారినపోయే వారిపై ఎడాపెడా దాడిచేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సన్యాసిరావు అనే వ్యక్తి పరిస్థితి ప్రమాదకరంగా వుంది. ఈ దశలో స్థానికులు రాళ్లతో ఎదురుదాడి జరపడంతో ఉన్మాద స్థితిలో వున్న యువకుడు సృహతప్పిపడిపోయాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+