వాజ్‌పేయికి బుష్ ఆహ్వానం
న్యూఢిల్లీ: నవంబర్ 9వ తేదీన వాషింగ్టన్‌ను సందర్శించాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ భారత ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయిని ఆహ్వానించారు. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి కొలిన్ పావెల్ బుధవారంనాడు ప్రకటించారు. వాజ్‌పేయి ఈ ఆహ్వానాన్ని మన్నించినట్లు ఆయన తెలిపారు.
ఐక్యరాజ్యసమితి జనరల్‌అసెంబ్లీకి ప్రధాని వస్తున్నారనే విషయం తమకు తెలుసునని, నవంబర్ 9వ తేదీన వాషింగ్టన్ రావాల్సిందిగా తమ అధ్యక్షుడు భారత ప్రధానిని ఆహ్వానించారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications