పావెల్ మాటలకు భారత్ అభ్యంతరం
న్యూఢిల్లీ: భారత్- పాక్ సంబంధాల్లో కాశ్మీరే కీలకమని అమెరికా విదేశాంగ మంత్రి కొలిన్ పావెల్ చేసిన ప్రకటన పట్ల భారత్ తన ఆందోళన వ్యక్తం చేసింది. పావెల్ మంగళవారం సాయంత్రం ఇక్కడికి చేరుకున్నారు. ఆయనవిమానాశ్రయంలో విదేశాంగ కార్యదర్శి చోకిలా అయ్యర్, భారత్‌లో అమెరికా రాయబారి రాబర్ట్ బ్లాక్‌విల్, అమెరికాలో భారత రాయబారి లలిత్ మాన్‌సింగ్‌స్వాగతం పలికారు. భద్రతా కారణాల దృష్ట్యా పావెల్‌కు రెడ్ కార్పెట్‌స్వాగతం లభించలేదు.
అనంతరం పావెల్ భారత విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్‌తో సమావేశమయ్యారు. ఆ సందర్భంలో కాశ్మీర్‌పై భారత్ అభిప్రాయాలను జస్వంత్ పావెల్‌కు స్పష్టం చేశారు.
తీవ్రవాదంపై పోరుకు భారత్ మద్దతు ఇవ్వడాన్ని పావెల్ ప్రశంసించారు. తీవ్రవాదంపై పోరును ముమ్మరం చేయాలని, తాలిబాన్లను గద్దె దించిన తర్వాతఅఎn్ఘాన్‌లో బహుళ జాతుల సమాహారంతో కూడిన విస్తృత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఇద్దరు ఒకఅంగీకారానికి వచ్చారు.












Click it and Unblock the Notifications