కవ్విస్తున్న భారత్‌ఃపాక్‌

ఇస్లామాబాద్‌ః సరిహద్దుల్లో భారత సైనిక దళాల సంచలనం జోరుగా వున్నదని ఆరోపిస్తూ పాకిస్తాన్‌ తన బలగాలను అప్రమత్తం కావల్సిందిగా ఆదేశించింది. తమ బలగాలు పూర్తి సన్నద్ధతో వున్నాయని భారత్‌ నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు కనిపించినా ప్రతీకారానికి దిగడం ఖాయమని పాకిస్తాన్‌ ప్రకటించింది.

భారత రక్షణ మంత్రి జార్జ్‌ బాధ్యతలుస్వీకరించిన వెంటనే చేసిన వ్యాఖ్యలను బాధ్యతారహితమైనవిగా పాకిస్తాన్‌ రక్షణ శాఖ ప్రతినిధి మేజర్‌ జనరల్‌ రషీద్‌ ఖురేషీపేర్కొన్నారు. ఎలాంటి కవ్వింపు లేకుండా భారత దళాలు సరిహద్దుల్లో పాకిస్తాన్‌ బంకర్లు, పోస్టులపై దాడి జరపడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తమ దళాలు ఇప్పుడు పూర్తి అప్రమత్తంగా వున్నాయని భారత్‌ దుస్సాహసానికి దిగితే తగిన పాఠం చెప్పడం ఖాయమని ఆయన వెల్లడించారు.

సరిహద్దుల వెంబడి భారతసైనిక సంచలనం తమ భద్రతకు ముప్పు కలిగించేదిగా వున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌లో జరుగుతున్న కొన్ని ప్రజాప్రదర్శనలను దృష్టిలో వుంచుకుని దేశంలో అంతర్గత సుస్థిరత లేదని ఇదే అదనుగా దాడులు చేయాలని ఎవరైనా భావిస్తే వారు తగిన మూల్యం చెల్లించకతప్పదని రషీద్‌ ఖురేషీ అన్నారు. పాకిస్తాన్‌లు ఏకం కావడం తథ్యమని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+