అగ్నికీలల్లో కాబూల్
ఇస్లామాబాద్‌ః అమెరికా నిర్విరామంగా పదిరోజుల పాటు కురిపించిన బాంబులతో కాబూల్ తగలబడిపోతున్నది. బుధవారం నాడు అమెరికా అత్యాధునిక యుద్ధ విమానాలతో తక్కువ ఎత్తునుంచి జరిపిన దాడుల తర్వాత చమురు కేంద్రాలు, ఆయుధ గిడ్డంగులు, రెడ్‌క్రాస్ సొసైటీకి చెందిన ఆహారాధాన్యాల నిల్వలు అంటుకోవడంతో భారీ ఎత్తున అగ్ని జ్వాలలు చెలరేగాయి.
తాలిబన్‌సైన్యం 16వ డివిజన్ ఆయుధ డిపో పూర్తిగా తగలబడిపోతున్నట్టుగా వార్తలుఅందాయి. కాందహార్‌పై దాడిలో బుధవారం నాడు కనీసం పదిమంది మరణించినట్టుగా తాలిబన్ వర్గాలు చెప్పాయి. మరో 20 మంది గాయపడినట్టుగా వారు వెల్లడించారు. గత పదిరోజుల్లో అమెరికా దాడుల్లో మరణించిన పౌరుల సంఖ్య 400 దాటినట్టుగా తాలిబన్లు చెబుతున్నారు. అత్యంత అధునాతనమైన ఎసి-130 యుద్ధవిమానాలతో అమెరికా జరుపుతున్న దాడులు తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నాయి.
తక్కువ ఎత్తునుంచి ఈవిమానాలు జరుపుతున్న దాడులు తాలిబన్లకుఏలాంటి ఆశలు మిగలకుండా చేస్తున్నాయి. సైనిక చర్యతోపాటు అమెరికా సమాచార యుద్ధం కూడా ప్రారంభించింది. తాలిబన్లకు వ్యతిరేకంగాఅఎn్గాన్లను రెచ్చగొట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అమెరికా బాంబులు కాబూల్‌లోని ఒక స్కూల్‌పై కూడా పడ్డాయి. అయితే అదృష్టవశాత్తు ఆ బాంబుపేలలేదని తాలిబన్ వర్గాలు చెప్పాయి.
గురితప్పిన దాడులతో రెడ్‌క్రాస్ ఆహార గిడ్డంగిఅగ్నిజ్వాలల్లో చిక్కుకున్నది. అసలే ఆకలితో అలమటిస్తున్నఅఎn్గాన్ల పరిస్థితి ఈ గిడ్డంగి దగ్ధమైతే మరింతవిషమించే అవకాశం వుంది. అలలుఅలలుగా మెరుపువేగంతో దూసుకు వస్తున్న యుద్ధవిమానాలు భీకరంగా బాంబులు గుప్పించి తృటిలో మాయమవుతున్నాయి. తాలిబన్ల స్థయిర్యం సన్నగిల్లుతున్నదనిపెద్ద సంఖ్యలో తాలిబన్ ప్రత్యర్ధి శిబిరంలోకి ఫిరాయిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications