అమెరికా ఓటమి ఖాయం: ఒమర్
ఇస్లామాబాద్: అమెరికా ఓడిపోక తప్పదని, అంత వరకు సహనం వహించాలని తాలిబాన్ నేత ముల్లా మహమ్మద్ ఒమర్ తన అనుచరులను ఉద్దేశించి అన్నారు.అక్టోబర్ 13 తర్వాత ఒమర్ తన అనుచరులను ఉద్దేశించి ప్రకటన చేయడం ఇదే ప్రథమం. ఆయన ప్రకటన తాలిబాన్ ఇంటర్నల్ వైర్‌లెస్ నెట్‌వర్క్‌లో ప్రసారమైనట్లుఅఎn్ఘాన్ ఇస్లామిక్ ప్రెస్ పేర్కొంది.
ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. మరణానికి మనం భయపడడం లేదు. మనం ముస్లింలుగా మరణిద్దాం అని ఆయన సందేశమిచ్చారు.రష్యన్లపై మనం పోరాడాం. విశ్వాసఘాతకులపై ఇది మరోజిహాద్. ఇదొ పరీక్ష. ప్రజలు వేదన చెందుతున్నారు. కానీ దేవుడువిజయాన్ని అందిస్తాడు. మన శత్రువులు ముస్లింకు అంగీకారయోగ్యులు కానివిశ్వాస హీనులు అని ఒమర్ అన్నారు.
తాలిబాన్‌లకు ఆయువుపట్టు అయిని కాందహార్‌పై అమెరికా 48 గంటల నిరంతరాయ దాడుల నేపథ్యంలో ఒమర్ ప్రకటన వెలువడింది. గతవారం ఆయన ఇంటిపై క్షిపణి ప్రయోగం జరిగింది. ఈ దాడి నుంచి ఆయన ప్రాణాలతో బయట పడ్డారు.












Click it and Unblock the Notifications