పాకిస్తాన్ కట్టుకథలు
న్యూఢిల్లీః సరిహద్దుల్లో భారత సైనిక సంచలనానికి సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్ సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ రషీధ్ ఖురేషీ చేసిన ప్రకటనను ఖండిస్తూ పాక్ చెబుతున్నవన్నీ కట్టుకథలని భారత ప్రతినిధి ప్రకటించారు.
పాకిస్తాన్ నిగ్రహం పాటిస్తే మంచిదని భారత్ సూచించింది. దూకుడుగా మాట్లాడుతూ సమరసన్నాహాన్ని పాకిస్తాన్ వ్యక్తం చేయడాన్ని భారత్ తప్పుబట్టింది. ఇదిలా వుండగా సరిహద్దుల్లో పాకిస్తాన్ తన దళాలను అప్రమత్తం చేయడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. భారత్ కూడా ధీటుగా స్పందిస్తున్నది.












Click it and Unblock the Notifications