భారత్‌పై తీవ్రవాదంమీదా పోరు
న్యూఢిల్లీ: తీవ్రవాదానికి వ్యతిరేకంగా అమెరికా చేస్తున్న పోరులో భారత్‌పైకి ఉద్దేశించిన తీవ్రవాద చర్యలు కూడా పరిగణనలోకి వస్తాయని అమెరికా విదేశాంగ మంత్రి కొలిన్ పావెల్ అన్నారు.ఉగ్రవాదంపై అంతర్జాతీయ కూటమి చేస్తున్న పోరులో భారత్‌పైకి ఉద్దేశించి తీవ్రవాద చర్యలు కూడా గణనలోకి వస్తాయని నేను హామీ ఇస్తున్నాను అని ఆయన అన్నారు. భారత విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్‌తో పాటు సంయుక్తవిలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆల్ ఖైదా నెట్‌వర్క్‌ను అంతం చేసి ఉగ్రవాదులకు ఆశ్రయంగా ఆఎn్ఘానిస్థాన్‌ను లేకుండా చేయడమే తమ పోరు ఉద్దేశమని ఆయన చెప్పారు. ఆ లక్ష్యాన్ని తాము సాధిస్తామని, అధ్యక్షుడు జార్జి బుష్, అంతర్జాతీయ కూటమి కడదాకా నిలబడుతాయని ఆయన అన్నారు. ఉగ్రవాదంపై పోరు చేసేవిషయంలో అమెరికా, భారత్‌లు ఒక తాటి మీద ఉన్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications