తెగని ఆర్టీసీ సమ్మె
హైదరాబాద్‌ః ఆర్టీసీ సమ్మె బుధవారం నాడు మూడో రోజు కూడా కొనసాగింది. ఆర్ధిక డిమాండ్లను అంగీకరించే సమస్యేలేదని ప్రభుత్వం నిర్ద్వంద్వంగా ప్రకటించగా, అన్ని డిమాండ్లను ఒప్పుకోవల్సిందేనని సంస్థ నష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆర్టీసీ ఉద్యోగుల సంఘాలు అంటున్నాయి.
మంత్రివర్గ ఉపసంఘ తమ 25 డిమాండ్లలో కేవలం నాలుగు డిమాండ్లను మాత్రమే చర్చించడాన్ని వారు తప్పుబడుతున్నారు. మరోవంక ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెను ప్రతిపక్షాలు గట్టిగా సమర్ధిస్తున్నాయి. 1995 వరకు లాభాల్లో వున్న ఆర్టీసీ నష్టాలకు చంద్రబాబు ప్రభుత్వానిదే బాధ్యత అని కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డివిమర్శించారు. ఆర్టీసీ లాభనష్టాలపై బహిరంగ చర్చకు రావాలని సిపిఎం రాష్ట్ర ప్రభుత్వాన్ని సవాలు చేసింది. ప్రభుత్వవివక్ష విధానాల వల్లనే ఆర్టీసి కనీసం 1500 కోట్ల రూపాయల నష్టం వస్తున్నదని ప్రకటించింది.ఇదిలా వుండగా సమ్మె వల్ల సగటు ప్రజలు మాత్రం నరకయాతన అనుభవిస్తున్నారు.












Click it and Unblock the Notifications