లాడెన్ అప్పగింతకు తాలిబాన్ ప్రతిపాదన
లండన్: అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్ లాడెన్‌ను అప్పగిస్తామని అఎn్ఘానిస్థాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వంలోనిసీనియర్ మంత్రి చెప్పినట్లు ది గార్డియన్ పత్రిక రాసింది. ఈవిషయాన్ని పాకిస్థాన్ సీనియర్ అధికారులు చెప్పినట్లు ఆ పత్రిక రాసింది. సాక్ష్యాధారాలు అవసరం లేకుండానేఅఎn్ఘానిస్థాన్‌పై బాంబు దాడులు నిలిపేస్తే లాడెన్‌ను మూడో దేశంలో విచారించడానికిఅప్పగిస్తామని మొదటి సారి తాలిబాన్ అంగీకరించిందని ఆ పత్రిక రాసింది.
ఆ పత్రిక కథనం ప్రకారం- తాలిబాన్ విదేశాంగ మంత్రి ముల్లా వకీల్ అహ్మద్ ముత్తా వకీల్ ఈ నెల 15 తేదీన అత్యంత రహస్యంగా ఇస్లామాబాద్‌ను సందర్శించారు. ముత్తా వకీల్‌సిఐఎ, పాకిస్థాన్ ఇంటిలిజెన్స్ అధికారులను కలిశారు. ఈ సందర్భంగా తాలిబాన్ లాడెన్‌నుఅప్పగించే ప్రతిపాదన చేసింది.
అయితే, అమెరికా అధికారులు తాలిబాన్ ప్రతిపాదనను తిరస్కరించారు. వారు తాలిబాన్ నాయకత్వంలో చీలికను కోరుకుంటున్నారు. తాలిబాన్‌లో ముత్తావకీల్ మితవాదిగా పేరపడ్డారు. దీంతో పాలనలో సమూలమైన మార్పులు తేవాలని అమెరికా ఆయనపై ఒత్తిడి తెస్తోంది. మితవాదులందరినీ ఏకం చేసే ప్రయత్నాలు చేయాలని ముత్తా వకీల్‌పై అమెరికా ఒత్తిడిపెంచింది. అయితే, అమెరికా విదేశాంగ మంత్రి కొలిన్ పావెల్‌తో ముఖాముఖి మాట్లాడే అవకాశం కల్పించాలని ముత్తా వకీల్ అడిగారు. కానీ అటువంటి సమావేశం పావెల్‌తో జరగలేదు. దీంతో 16వ తేదీన ముత్తా వకీల్ కాబూల్ తిరిగి వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications