అమెరికా, భారత్‌ల మధ్యఒప్పందం
న్యూఢిల్లీ: అమెరికా, భారత్‌లు బుధవారం అంతర్జాతీయ ఉగ్రవాదం అణచివేతకు పరస్పర సహకారంఅందించుకునే ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశాయి. సమాచార, గూఢచార రంగాల్లో పరస్పర సహకారానికి ఉభయ దేశాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. అమెరికా విదేశాంగ మంత్రి కొలిన్ పావెల్ భారత హోంమంత్రి ఎల్.కె. అద్వానీ ఈ ఒప్పందంపై బుధవారం సంతకాలు చేశారు. ఈ ఒప్పందం వల్ల లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఉమ్మడి లక్ష్యాన్ని మరింత మెరుగుగా అమలు చేయడానికి రెండు దేశాల సామర్థ్యం పెరుగుతుందని అధికారులు చెప్పారు.
నేరస్థులను అప్పగించుకునేందుకు 1999లో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం మరింత పటిష్టంగా అమలు చేయడానికి ప్రస్తుత ఒప్పందం దోహదపడుతుందని వారన్నారు. ఉభయ దేశాల నేతల మధ్యఅర గంట పాటు చర్చలు జరిగాయి. ఉగ్రవాదాన్ని ద్విగుణీకృత కృషితో ఎదుర్కోవడానికి కట్టుబడి వుంటామని, ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రస్తుత ఒప్పందం ఉపయోగపడుతుందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు.పరస్పర సహకారంతో తీవ్రమైన నేరాల దర్యాప్తు,విచారణ, నిరోధం, అణచివేతలకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని అధికారులన్నారు.












Click it and Unblock the Notifications