బాబు వైఖరిపైవిపక్షాల ఆగ్రహం
హైదరాబాద్‌ః ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి ప్రభుత్వం తక్షణం తగిన చర్యలు తీసుకోవాలని వివక్షాలు డిమాండ్ చేశాయి. ప్రధాన ప్రతిపక్షాలనేతలు శుక్రవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలసి ఒక వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రంలో కోటిమందికి పైగా ప్రజలు నిత్యం ఉపయోగించే రవాణా వ్యవస్థి స్తంభించిపోయి నాలుగయిదు రోజులు గడుస్తున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడాన్ని వారు దుయ్యబట్టారు.
ఆర్టీసీ సిబ్బంది కోరికలు వ్యాయంగానే వున్నాయని సిపిఐ నేత సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు కేశవరావు స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సులపై అనుచితంగా వసూలు చేస్తున్న మోటారు టాక్సును తగ్గించి, ప్రైవేట్ బస్సుల బెడదను తగ్గించడం వల్ల 400 కోట్ల రూపాయల మేర సంస్థకు లాభిస్తాయని వారుపేర్కొన్నారు.
ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోతే దానికి సిబ్బంది ఏవిధంగా బాధ్యత వహిస్తారని వారు ప్రశ్నించారు. రవాణా వ్యవస్థ స్తంభించిపోయినప్పటికీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పట్లలోవిఫలమైందని వారు దుయ్యబట్టారు. ఇదిలా వుండగా చర్చల్లో ప్రభుత్వం మొండివైఖరిని నిరసిస్తూ నిర్బంధం ఎంత తీవ్రంగా వున్నా తాము సమ్మెను కొనసాగించి తీరుతామని వారు ప్రకటించారు.












Click it and Unblock the Notifications