ప్రతి గ్రామానికి టెలీ మెడిసిన్: బాబు
హైదరాబాద్: ప్రతి గ్రామానికి టెలీ మెడిసిన్‌అందుబాటులోకి తేవడానికి ఒక ఏడాది పడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గ్రామాల్లోని ఆస్పత్రులను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, జిల్లా ఆస్పత్రులను హైదరాబాద్‌లోని సూపర్‌స్పెషాలిటీస్ ఆస్పత్రులతో, ప్రయివేట్ ఆస్పత్రులతో అనుసంధానం చేసి టెలీ మెడిసిన్‌ను గ్రామీణపేదలకు అందుబాటలోకి తేవాలని ఆయన అభిప్రాయపడ్డారు. మహబూబ్‌నగర్ ప్రభుత్వాస్పత్రిని కేర్ ఆస్పత్రికి అనుసంధానం చేస్తూఅందుబాటులోకి తెచ్చిన టెలీ మెడిసిన్ సౌకర్యాన్ని ఆయన గురువారం ప్రారంభించారు.
తక్కవ ఖర్చుతో టెలీ మెడిసిన్ ద్వారా గ్రామీణపేదలు వైద్య నిపుణుల సలహాలు పొందగలిగిన టెలీ మెడిసిన్ అన్ని గ్రామాలకుఅందుబాటలోకి వచ్చినప్పుడే ఇంటర్నెట్ ఫలితాలు సాధించినట్లని ఆయన అన్నారు. రిలయన్స్ సంస్థ చేపట్టిన ఆప్టిక్‌ఫైబర్ లైన్ ప్రాజెక్టు ఒక ఏడాదిలో పూర్తవుతుందని, అప్పుడు గ్రామాలకు టెలీ మెడిసిన్‌నుఅందుబాటులోకి తేవడానికి వీలవుతుందని ఆయన అన్నారు. గుండె పోటు వంటి తీవ్రవ్యాధులకు సంబంధించి ప్రభుత్వం ఒకశ్వేతపత్రం విడుదల చేస్తుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications