యుద్ధం సుదీర్ఘంః అమెరికా
న్యూయార్క్‌ః అల్‌ఖైదాతో పాటు తాలిబన్ సర్కార్‌ను కూడా నేలమట్టం చేసే వరకు అఎn్గాన్‌లో తమ కార్యక్రమం పూర్తికాదని అమెరికా స్పష్టం చేసింది.
అల్ ఖైదా, తాలిబన్ ఈ రెండు త్వరలోనే జాడలేకుండా పోవడం ఖాయమని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి కొలిన్ పావెల్ చెప్పారు. యుద్ధం దీర్ఘకాలికంగా సాగుతుందని అంతిమవిజయం ఖాయంగా అమెరికానే వరిస్తుందని అధ్యక్షుడు జార్జ్‌బుష్ వేరొక ప్రకటనలో తెలిపారు.
తాలిబన్ సర్కార్‌ను, అల్‌ఖైదా నెట్‌వర్క్‌నుఅఎn్గాన్ గడ్డపై నుంచి ఎంత త్వరగా తుడుచిపెట్టగలమో చూడాల్సివున్నదని అమెరికా రక్షణ మంత్రి డోనాల్డ్ రమ్స్‌ఫీల్డ్ వాయిస్ ఆఫ్ అమెరికాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. కేవలం లాడెన్ చంపడంతో తమ లక్ష్యం పూర్తికాదని లాడెన్ విస్తృత నెట్‌వర్క్‌ను నామరూపాలు లేకుండా చేయడం వల్ల మాత్రం టెర్రరిజం నుంచి పొంచుకుని వున్న ముప్పును దెబ్బతీయ గలమని ఆయన అన్నారు. తాలిబన్లలో ఉదారవాదులు వుండే అవకాశమే లేదని ఈ ఉదారవాదం-తాలిబన్లు ఈ రెండు పదాల మధ్య పొంతనే లేదని ఆయన వ్యాఖ్యానించారు. శీతాకాలం లోపలే దాడులను ముగించాలన్న కొన్ని వర్గాల డిమాండ్‌ను ప్రస్తావిస్తూ టెర్రరిజం పై అమెరికా పోరు దీర్ఘకాలికమైనదని ఒక్కరోజుతో అది పూర్తికాదని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications