వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విదేశాల్లో కృషి చైర్మన్
హైదరాబాద్‌ః కృషి బ్యాంకు చైర్మన్ కొసరాజు వెంకటేశ్వరరావు అధికారుల అండదండలతో చాలా రోజుల క్రితమే దేశ సరిహద్దులు దాటి సింగపూర్ చేరినట్టుగా వార్తలు వినవస్తున్నాయి. పోలీసు శాఖకే చెందిన సీనియర్ అధికారులు ఈ విషయం చెబుతున్నారు.
కృషి బ్యాంకు కుంభకోణం బయటపడిన తర్వాత కూడా చాలా రోజుల పాటు వెంకటేశ్వరరావు హైదరాబాద్‌లోనూ,విజయవాడలోనూ తలదాచుకున్నాడు. ఈ సమయంలోనే విదేశాలకు వెళ్లకుండా పాస్‌పోర్టునుసీజ్ చేయాల్సిందిగా పాస్‌పోర్టు అధికారులను ఆదేశించాలని, దేశంలోని ఏప్రాంతం నుంచి కూడా విదేశాలకు జారుకోకుండా ఇమ్మిగ్రేషన్ అధికారులను ఆదేశించాలని డిపాజిటర్లు డిమాండ్ చేశారు. ప్రభుత్వం కూడా సరిహద్దులు దాటే అవకాశం లేదని ప్రకటించింది. కుంభకోణం బయటపడిన రెండు నెలలకు ఇప్పుడు అధికారులు వెంకటేశ్వరరావు సింగపూర్ పారిపోయినట్టుగా చెబుతున్నారు.