SIR వల్లే ఓడిపోయాం..! సుప్రీం మెట్లెక్కిన మమత..! కీలక పరిణామాలు..!

పశ్చిమ బెంగాల్లో తాజాగా నిర్వహించిన ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) చిత్తుగా ఓడిపోయింది. అయితే బెంగాల్లో ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణలో అక్రమంగా ఓట్లు తొలగిస్తున్నారంటూ ఎన్నికల ముందు నుంచీ టీఎంసీ పోరాటం చేస్తోంది. కానీ అప్పట్లో సుప్రీంకోర్టు (Supreme Court). ఓటర్ల జాబితా సవరణ ద్వారా తొలగించిన ఓట్లు ఎన్నికల్లో ప్రత్యర్థి గెలుపు మార్జిన్ కంటే ఎక్కువగా ఉంటే న్యాయవిచారణ చేపడతామని హామీ ఇచ్చింది. దీంతో ఇప్పుడు అదే కారఇంతో మమతా బెనర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

మమతకు గవర్నర్ బిగ్ షాక్..! బెంగాల్ అసెంబ్లీ రద్దు..!
మమతకు గవర్నర్ బిగ్ షాక్..! బెంగాల్ అసెంబ్లీ రద్దు..!

ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ వల్ల జరిగిన ఓటర్ల తొలగింపు కొన్ని నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రభావితం చేసిందని టీఎంసీ సుప్రీంకోర్టులో ఆరోపించింది. బీజేపీకి అనుకూలంగా భారీ స్థాయిలో ఎన్నికల అవకతవకలు, ఓట్ల తారుమారు జరిగాయని టీఎంసీ చెబుతోంది. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ జరిపారు. ఈ సందర్భంగా 31 నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపు మార్జిన్ కంటే ఎస్ఐఆర్ తొలగింపులు ఎక్కువగా ఉన్నాయని టీఎంసీ నేత, లాయర్ కళ్యాణ్ బెనర్జీ వాదించారు. అనేక సందర్భాల్లో, తొలగింపులు మరియు గెలుపు మార్జిన్ దాదాపు ఒకేలా ఉన్నాయని పేర్కొన్నారు.

Supreme Court Sought on Bengal SIR Row as TMC Claims Deleted Votes Exceeded BJP s Margin in 31 seats
నేను కూడా సీఎం..? సువేందు ప్రమాణం తర్వాతా వెనక్కి తగ్గని మమత..!
నేను కూడా సీఎం..? సువేందు ప్రమాణం తర్వాతా వెనక్కి తగ్గని మమత..!

ఒక నియోజకవర్గంలో, పరిశీలన కోసం 5,432 మందికి పైగా ఓటర్లను జాబితా నుండి తొలగించగా, అక్కడ ఒక అభ్యర్థి 862 ఓట్ల తేడాతో ఓడిపోయారని కళ్యాణ్ బెనర్జీ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ, బీజేపీల మధ్య ఓట్ల తేడా దాదాపు 32 లక్షలు ఉందని, అప్పీలేట్ ట్రిబ్యునళ్ల ముందు దాదాపు 35 లక్షల అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తొలగించిన ఓటర్ల సంఖ్య కంటే గెలుపు మార్జిన్ తక్కువగా ఉంటే, ఆ విషయంపై న్యాయపరమైన పరిశీలన అవసరం కావచ్చని జస్టిస్ బాగ్చీ గతంలో చేసిన వ్యాఖ్యను కూడా ఆయన ప్రస్తావించారు. అయితే ఈ వాదనను ఎన్నికల సంఘం వ్యతిరేకించింది. దీనికి పరిష్కారం ఎన్నికల పిటిషన్ అని, ఎస్ఐఆర్, తత్ఫలితంగా వచ్చే అప్పీళ్లకు సంబంధించిన సమస్యలకు ఎన్నికల సంఘమే బాధ్యత వహిస్తుందని తెలిపింది. దీనిపై స్పందించిన సుప్రింకోర్టు.. బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఇతరులు తమ వాదనలకు సంబంధించి కొత్త పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+