వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఐరాస దూత
వాషింగ్టన్‌ః అఎn్గానిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వాన్ని కూల్చివేసిన తర్వాత ఏర్పాటు చేయాల్సిన ప్రత్యామ్నాయ ప్రభుత్వం గురించి అఎn్గానిస్తాన్‌లోని వివిధ గిరిజన తెగలు, మతనాయకులతో చర్చలు జరిపేందుకు ఐక్యరాజ్య సమితి తన దూతలను రంగంలోకి దించింది.
సమితి ప్రత్యేక దూతలుఅఎn్గాన్ నేతలతో పాటు పాకిస్తాన్, ఇరాన్ నాయకులతో కూడా ప్రత్యామ్నాయ ప్రభుత్వంపై చర్చలు జరుపుతారు. మాజీ రాజు జహీర్ షా నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు పిలుపునిస్తూ 1500 మంది వివిధ వర్గాల నేతల విస్తృత సమావేశం చేసిన సూచన నేపథ్యంలో సమితి చొరవ ప్రాధాన్యత సంతరించుకున్నది. తాలిబన్ సర్కారుకు క్రమంగా ప్రజల్లో మద్దతు తగ్గుతున్నదని అమెరికా ప్రభుత్వంఅంటున్నది. వారం పదిరోజుల్లో కొత్త ప్రభుత్వం రూపురేఖలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం వున్నదని భావిస్తున్నారు.