అదేపనిగా సాగుతున్న దాడులు
కాబూల్‌ః అఎn్గానిస్తాన్‌పై అమెరికా దాడులు ప్రారంభమై నెలరోజులు పూర్తయ్యాయి. అయినప్పటికీ ఇంకా తమ లక్ష్యానికి ఎంతదూరంలో వున్నమో అమెరికా తేల్చుకోలేకపోతున్నది.
సోమవారం నాడు కూడా ముమ్మరంగా కాబూల్, కాందహార్‌తో సహా పలు పట్టణాలపై అమెరికా మానాలు బాంబుల వర్షం కురిపించాయి. మరోవైపు ఉత్తర ప్రాంతంలో మజారే షరీఫ్ కోసం నానాపాట్లు పడుతున్న నార్తర్న్ అలయెన్స్‌కు దన్నుగా మరో మూడు డిజన్ల పదాతి దళాలను కూడా పంపినట్టు అమెరికా సైనికాధికారులు వెల్లడించారు.
గతనెలరోజుల్లో తాము వ్యూహాత్మకంగా గణనీయమైన జయాలనే సాధించినట్టుగా అమెరికా చెబుతున్నది. పూర్తిస్థాయిలో భూతల యుద్ధం కూడా కొనసాగుతున్నందువల్ల ఇక త్వరలోనే యుద్ధం నిర్ణయాత్మక దశకు చేరుకుంటుందని అమెరికా భాస్తున్నది.












Click it and Unblock the Notifications