బాబుది పద్ధతి కాదు: ఎమ్మెస్సార్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఎపిఎస్‌ఆర్టీసి) సమ్మెపై ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహిరిస్తోందని ప్రదేశ్ కాంగ్రెస్ కుటీ అధ్యక్షుడుఎం. సత్యనారాయణరావు మర్శించారు. ఆర్టీసి సమ్మెను పరిష్కరించాలని తనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోరడం పద్ధతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
సమస్య తీవ్రత దృష్ట్యా ఆర్టీసి సమ్మెను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సత్యనారాయణ రావు రాసిన లేఖకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జవాబు ఇచ్చారు. తన పలుకుబడి వుపయోగించి సమ్మెను పరిష్కరించాలని చంద్రబాబునాయుడు సత్యనారాయణరావు ఇచ్చిన జవాబులోకోరారు. దీన్ని పత్రికా ప్రతినిధుల వద్ద గుర్తు చేస్తూసత్యనారాయణరావు- ముఖ్యమంత్రి అలా అనడం పద్ధతి కాదని అన్నారు. ముఖ్యమంత్రి తన బాధ్యతల నుంచితప్పించుకుంటున్నారని, అలా తనను అడగడం బాధ్యతల నుంచి తప్పించుకోవడమేనని సత్యనారాయణ రావు అన్నారు. సమ్మె పరిష్కారంలో కావాలంటే తన సహకారంఅందిస్తానని, ఆర్టీసి కార్మిక సంఘాల సంయుక్త కార్యాచరణ కుటీ నేతలతో అవసరమనుకుంటే తాను మాట్లాడుతానని ఆయన అన్నారు. ఆర్టీసి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications