జయీఫ్ నోటికి పాక్ తాళం
ఇస్లామాబాద్: ప్రతికా సమావేశాలు మానుకోవాలని పాకిస్థాన్ ఇస్లామాబాద్‌లోని తాలిబాన్ దౌత్యవేత్తకు సూచించింది. ప్రపంచ వ్యాప్తంగాఅందరి దృష్టిని ఆకర్షిస్తున్న తాలిబాన్ దౌత్యవేత్త అబ్దుల్ సలాం జయీఫ్ పత్రికా సమావేశాలు అమెరికాకు చిరాకు తెప్పిస్తున్నాయి. దీంతో తాలిబాన్ దౌత్యవేత్త నోటికి తాళం వేసేందుకు పాకిస్థాన్ పూనుకుంది.
దౌత్య నిబంధనలను పాటించాలని తాలిబాన్ దౌత్యవేత్త అబ్దుల్ సలాం జయీఫ్‌కు చెప్పినట్లు పాకిస్థాన్ దేశాంగ శాఖ అధికార ప్రతినిధిఅజీజ్ అహ్మద్‌ఖాన్ చెప్పారు. అలా చెప్పే హక్కు తమకు ఉన్నదని ఆయన అన్నారు.
పాకిస్థాన్ ప్రభుత్వ ఆదేశాలపై వ్యాఖ్యానించడానికి ఇస్లామాబాద్‌లోని తాలిబాన్ దౌత్య కార్యాలయంలో ఎవరూఅందుబాటులో లేరు. జయీఫ్ బుధవారం పత్రికా సమావేశం ఏర్పాటు చేయలేదు. నిజానికి ఆయన ప్రతి రోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి అమెరికాను దుయ్యబడుతూ వస్తున్నారు. ఈయన పత్రికా సమావేశాలకుపెద్ద యెత్తున దేశీ ప్రతినిధులు హాజరవుతూ వస్తున్నారు.












Click it and Unblock the Notifications