వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అఎn్ఘాన్‌పై అమెరికా తాజా దాడులు
కాబూల్:అఎn్ఘానిస్థాన్ అమెరికా తన దాడులను ఉధృతం చేసింది.అఎn్ఘానిస్థాన్‌లో అమెరికా తన పదాతి దళాలను దించి భూతల పోరుకు సిద్ధపడుతోంది. అమెరికా జెట్లుఅఎn్ఘానిస్థాన్ ఈశాన్య సరిహద్దుల్లోని తజికిస్థాన్‌ను అనుకుని వున్న తాలిబాన్ స్థావరాలపై బుధవారం బాంబులు కురిపించాయి.
స్థానిక కాలమానం ప్రకారం- బుధవారం తొలి దఫా బాంబులు ఉదయం 8 గంటల ప్రాంతంలో పడ్డాయి. ఆ తర్వాతఅరగంటకు అమెరికా జెట్లు ఆర డజను బాంబులు వేశాయి. మొదటి దాడి తర్వాత తాలిబాన్లు అమెరికా జెట్లపై క్షిపణులను ప్రయోగించారు.అయినా లాభం లేకపోయింది.
ఇదిలా వుంటే, నార్తర్న్ అలయెన్స్ బలగాలు మజార్-ఎ-షరీఫ్‌ను చేరుకోవడానికి తాలిబాన్ బలగాలపై కాల్పులు జరుపుతున్నాయి. అయితే, నార్తర్న్ అలయెన్స్ బలగాలు ముందుకు సాగలేకపోతున్నాయి.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!