నరమేధం చేస్తున్న పాక్ తో చర్చలా?
మాస్కోః పాకిస్తాన్ తో చర్చలు జరిపేందుకు ఇది సరైన సమయం కాదని భారత ప్రధాని వాజ్ పేయి అభిప్రాయ పడ్డారు. పాకిస్తాన్ తో చర్చలు జరిపి ఆసియాలో శాంతిని స్థాపించాల్సిందిగా రష్యాతో సహా పలు దేశాలు కోరుతున్నాయని అయితే పాక్ తో చర్చలకు ఇంకా సమయం రాలేదని వాజ్ పేయి బుధవారం నాడు మాస్కోలో లేకరుల సమావేశంలో అన్నారు. కాశ్మీర్ లో అమాయకుల నిండు ప్రాణాలను పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు బలిగొంటుండగా పాకిస్తాన్ తో మే హాయిగా ఎలా చర్చలు జరుపుతాం అని వాజ్ పేయి నిష్టూరంగా అన్నారు.
భద్రతా వ్యవహారాలపై భారత్ - రష్యాలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయని వాజ్‌పేయి వరించారు. ఒప్పందాల వరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. రష్యాలో పర్యటన ముగించుకున్న వాజ్‌పేయి బుధవారం నాడు వాషింగ్టన్ చేరుకున్నారు. ఈ నెల 9న వాజ్‌పేయి అమెరికా అధ్యక్షుడు బుష్ తో చర్చలు జరుపుతారు. ఉగ్రవాదంపై అమెరికా పోరాటం ప్రారంభించిన నేపధ్యంలో బుష్-వాజ్‌పేయి చర్చలు ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications