ఐదుగురు మెడికల్ స్టూడెంట్స్‌అరెస్టు
హైదరాబాద్: ర్యాగింగ్‌కు పాల్పడిన ఐదుగురు గాంధీ వైద్య కళాశాల స్టూడెంట్స్‌ను పోలీసులు బుధవారంఅరెస్టు చేశారు. ర్యాగింగ్‌లో భాగంగా ప్రథమ సంవత్సరం వైద్య ద్యార్థులనుసీనియర్ ద్యార్థులు వస్త్రలను చేశారనే ఆరోపణపై గత రెండు రోజులుగా గాంధీ వైద్య కళాశాలలో ఆందోళన జరుగుతోంది. ఎట్టకేలకు ర్యాగింగ్‌కు పాల్పడిన ఐదుగురిని పోలీసులుఅరెస్టు చేయడంతో ఆందోళన సద్దుమణిగింది. అుత్, లోకేష్, శ్రావణ్‌కుమార్‌లతో పాటు మరో ఇద్దరిని పోలీసులుఅరెస్టు చేశారు.
తాము ముందు ఒకర్ని పట్టుకున్నామని, ఆ తర్వాత మరో నలుగురికి వర్తమానం పంపామని, సరెండర్ కాకపోతే నేరగాళ్లను వేటాడినట్లు వేటాడి పట్టుకోవాల్సి వస్తుందని హెచ్చరించామని, దీంతో మరో నలుగురు లొంగిపోయారని సంబంధిత పోలీసు ఉన్నతాధికారి చెప్పారు.
సూపర్‌మాన్‌పేరుతో జూనియర్ల బట్టలు ప్పించి సీనియర్ల వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన చెప్పారు. ఇందులో భాగంగా జూనియర్ స్టూడెంట్ ప్యాంటుపై నుంచి అండర్ వెయర్ ధరించాల్సి వుంటుందని, ఇందుకు గాను జూనియర్ స్టూడెంట్ ప్యాంటు ప్పేసి, అండర్ వెయర్ తీసి ప్యాంటు వేసుకుని దానిపై నుంచి అండర్ వెయర్ ధరించాల్సి వుంటుందని, ఇది ద్యార్థులను నగ్నం చేయడం తప్ప మరోటి కాదని ఆయన అన్నారు.
అమ్మాయిలు కూడా ర్యాగింగ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన చెప్పారు. పత్రికల్లో వస్తున్నంత తీవ్రంగా కాకున్నా ర్యాగింగ్ జరుగుతున్న మాట మాత్రం వాస్తవమేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications