న్యూఢిల్లీః ఎన్డీఏ జాతీయ అజెండాకు భిన్నంగా వ్యవహరిస్తే వాజ్‌పేయి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే షయాన్ని పునరాలోచిస్తామని తెలుగుదేశం పార్టీ హెచ్చరించింది. అయోధ్యపై భారతీయ జనతా పార్టీ వైఖరి లౌకికవాదానికి భిన్నంగా వున్నదని రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ నాయకుడు డాక్టర్ అల్లాడి రాజ్ కుమార్ మర్శించారు. పోటోపై కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఎవరితో సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకున్నదని రాజ్ కుమార్ ధ్వజమెత్తారు.
దివంగత నేత ఎన్టీఆర్ లౌకికవాద లవలతో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారని, ఆ సూత్రాలకు భంగం కలిగిస్తే ఎన్డీఏతో తెగతెంపులు చేసుకొనేందుకైనా వెనుకాడబోమని రాజ్ కుమార్ హెచ్చరించారు. జార్జి ఫెర్నాండెజ్ వ్యవహారంలో దమ్ముంటే అశ్వాస తీర్మానంపెట్టుకోండంటూ సవాల్ సిరిన ఎన్డీఏ సర్కార్ తెలుగుదేశం పార్టీ ఇలా హెచ్చరికలు జారీ చేయడంతో కంగారు పడిపోతున్నది.












Click it and Unblock the Notifications