పవన్ కళ్యాణ్ శాఖలో ఉద్యోగులకు అదిరిపోయే వార్త... వాళ్లకు పండుగే!

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగులకు గొప్ప సంతోషకర వార్త. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతుల ప్రక్రియలో మరో కీలక అడుగు ముందుకు పడింది. డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ 42 మంది మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు సీనియారిటీ జాబితాను ఆమోదించింది. వీరందరినీ త్వరలో డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టులకు పదోన్నతి ఇవ్వనున్నారు.

పంచాయతీ రాజ్ శాఖలో పదోన్నతులలో మరో కీలకఅడుగు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని పంచాయతీరాజ్ శాఖలో ఈ పదోన్నతులు మరో కీలక అడుగుగా చెప్పవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ శాఖలో భారీ స్థాయిలో పదోన్నతులు అమలు చేస్తున్నారు. గతంలో పదేళ్లలో ఇంత పెద్ద సంఖ్యలో ప్రమోషన్లు ఇవ్వడం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. ఇంతకుముందు కూడా 10,000 మందికి పైగా ఉద్యోగులకు పదోన్నతులు కల్పించిన సంగతి తెలిసిందే.

Deputy CM Pawan Kalyan said good news AP Promotion Committee approves seniority list as DDOs

పదోన్నతులపై అధికారుల హర్షం

ఇక తాజాగా మరోమారు పదోన్నతులు ఇస్తున్న క్రమంలో పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పదోన్నతులు ఉద్యోగుల మనోధైర్యాన్ని పెంచడంతో పాటు గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే, కమిషనర్ కృష్ణ తేజ్ తదితర ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

సీజనల్ వ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టి

వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణను ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు. దోమల నియంత్రణకు ఫాగింగ్ కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. నీటి నిల్వలు ఎక్కడా ఉండకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. తాగునీటి నాణ్యత పరీక్షలు మరియు లీకేజీలు అరికట్టడం కూడా ప్రాధాన్యమని అన్నారు. "ఫ్రైడే - డ్రైడే" కార్యక్రమం సక్రమంగా అమలు చెయ్యాలన్నారు.

నేను గుంపు మేస్త్రినే.. మరోమారు క్లారిటీ ఇచ్చిన రేవంత్.. వైరల్ వీడియో!
నేను గుంపు మేస్త్రినే.. మరోమారు క్లారిటీ ఇచ్చిన రేవంత్.. వైరల్ వీడియో!

ప్రజారోగ్య పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం సహించేది లేదన్న పవన్ కళ్యాణ్

ఘన వ్యర్థాల నిర్వహణ మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రజారోగ్య పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం సహించేది లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జిల్లా, మండల స్థాయిల్లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీములు సిద్ధంగా ఉంచాలని, కమాండ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+