ఫోర్ట్ కాంప్ బెల్‌ః ఉగ్రవాదంపై యుద్ధం అప్పుడే ముగిసిపోలేదని, అల్ ఖైదా నెట్ వర్క్ సమూలంగా నాశనం చేసే కఠిన లక్ష్యం ముందుందని అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్యు. బుష్ వ్యాఖ్యానించారు. కఠినమైన పరీక్షలు ముందున్నాయి, పదివేల మందిసైనికులు అల్ ఖైదాను, లాడెన్ ను పట్టుకొనేందుకు నిరంతరం శ్రుస్తున్నారనిసైనికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన చెప్పారు.
ఆఫ్ఘనస్తాన్ లో తొలిదశలో జయం సాధించాం.... ఇంకా సాధించాల్సింది ఎంతో వున్నదని ఆయన చెప్పారు.
ఉగ్రవాదం సమూలంగా రూపుమాసిపోనిదే మనం ప్రశాంతంగా వుండలే అని ఆయన చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ కు అవసరమైతే మరిన్ని పదాతి దళాలను పంపించి తాలిబన్లపై ఒత్తిడిపెంచేందుకు సిద్ధంగా వున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
