శ్రీకాకుళంః ఓ ఐ.ఎ.ఎస్. అధికారిపై దౌర్జన్యం చేశారని రుజువు కావడంతో ప్రముఖ సినీనటుడు, మాజీఎం.పి. డాక్టర్ ఎం. మోహన్ బాబుకు ఏడురోజుల జైలుశిక్ష ధించారు. ఆముదాల వలస ఫస్ట్ క్లాస్ మేజిస్టేట్ చక్రపాణి బుధవారం ఈ తీర్పు చెప్పారు. 1996లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో పరిశీలకునిగా వ్యవహరిస్తున్న పశ్చిమబెంగాల్ ఐఎఎస్ అధికారి బెనర్జీపై మోహన్ బాబు దౌర్జన్యం చేశారని, ఆయనను ధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ కేసు దాఖలైంది.
కేసును పరిశీలించిన మేజిస్ట్రేట్ ఏడురోజుల పాటు జైలు శిక్ష ధిస్తూ తీర్పు చెప్పారు.అప్పీలుకు dలు కల్పిస్తూ బెయిలు మంజూరు చేయాల్సిందిగా మోహన్ బాబు మేజిస్ట్రేట్ నుకోరారు. అందుకు సమ్మతించిన మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. మోహన్ బాబుస్వయంగా ఆముదాల వలస కోర్టుకు హాజరై బెయిలు కోసం అభ్యర్ధించారు.












Click it and Unblock the Notifications
