ఇస్లామాబాద్: ఇస్లామాబాద్‌లోని తాలిబాన్ దౌత్య కార్యాలయాన్ని మూసేయాల్సిందిగా గురువారంనాడు పాకిస్థాన్ ఆదేశాలు జారీ చేసింది. పాకిస్థాన్ దౌత్య సంబంధాలను తెంచుకోవడంతో తాలిబాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇస్లామాబాద్‌లోని తాలిబాన్ కార్యాలయాన్ని మూసేయాలనే నిర్ణయాన్ని బుధవారంనాడే తీసుకున్నామని, అయితే, ఈ సంగతిని తాలిబాన్‌కు గురువారంనాడు తెలియజేశామని పాకిస్థాన్ దేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అజీజ్ అహ్మద్‌ఖాన్ చెప్పారు.
చాలా కాలంగా పాకిస్థాన్, సౌదీఅరేబియా, యునైటెడ్ అరబ్ ఎురేట్స్‌లు మాత్రమే తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తిస్తూ వచ్చాయి. అమెరికాలో దాడుల అనంతరం సౌదీఅరేబియా, అరబ్ యునైటెడ్ ఎురేట్స్ తాలిబాన్‌తో దౌత్య సంబంధాలను తెంచుకున్నాయి. అయితే, పాకిస్థాన్ మాత్రం తాలిబాన్‌తో దౌత్య సంబంధాలను కొనసాగిస్తూ వచ్చింది.
పాకిస్థాన్ ప్రకటన వెలువడడానికి ముందే తాలిబాన్ సిబ్బంది దౌత్య కార్యాలయాన్ని మూసేయడం ప్రారంభించారు. dసాలు ఇవ్వడం ఆపేశామని, తమ కార్యకలాపాలను అన్నింటినీ ఆపేశామని దౌత్య కార్యాలయ అధికారి ముఫ్తీ యూసుఫ్ చెప్పారు.












Click it and Unblock the Notifications
