రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి
హైదరాబాద్‌ః రంగారెడ్డి జిల్లా మాంచాల మండలంలో ఆగవల్లి గ్రామం వద్ద శనివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో 4గురు వ్యక్తులు మరణించారు.
నాగార్జునసాగర్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న లారీ-ఆటో ఢీకొనడంతో ఈ సంఘటన జరిగింది. ఆటోలో వున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ముగ్గురు రోజువారి కూలీలు. కాగా మరొకరు ఆటో డ్రైవర్. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
