కుందుజ్‌పై ఆగని బాంబుల వర్షం

కుందుజ్‌ః తాలిబన్ల చివరి స్థావరం కుందుజ్‌పై అమెరికా యుద్ధమానాల బాంబుల వర్షం కొనసాగుతునే వున్నది. అయితే నార్తర్న్‌ అలయన్స్‌ మాత్రం నిగ్రహం పాటిస్తున్నది. కుందుజ్‌లో వేల సంఖ్యలో వున్న తాలిబన్లు లొంగిపోవడానికి సిద్ధంగా వున్నట్టుగా ప్రకటించడంతో నార్తర్న్‌ అలయన్స్‌ బలగాల ప్రధానాధిపతి రషీద్‌ దోస్తుంతన సేనలను నగర శివార్లలోనే నిలిపివేశారు. అయితే దోస్తుం నిర్ణయాన్ని అలయన్స్‌ అగ్రనేత మాజీ అధ్యక్షుడు రబ్బానీ తీవ్రంగా ఆక్షేపించినట్టు తెలిసింది.

నార్తర్న్‌ అలయన్స్‌ సేనలు కుందుజ్‌లోకి దూసుకుపోతే పరిస్థితి షుంచే అవకాశం వున్నదన dధుల్లో నెత్తురు మడుగులు కట్టడం ఖాయమని ఐక్యరాజ్య సుతి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నది. అలయన్స్‌ బలగాలు కుందుజ్‌లోకి ప్రవేశిస్తే మజారేషరీఫ్‌ సంఘటనలే మళ్లీ పునరావృత్తం అయ్యే అవకాశం వున్నదన్న భయాన్ని రెడ్‌క్రాస్‌ వ్యక్తం చేసింది. లొంగుబాటు ునహా తాలిబన్లకు మరోమార్గం లేదని అందువల్ల ఆదివారం వరకు వారికి గడువు ఇవ్వాలని నిర్ణయించినట్టుగా దోస్తుం ధేయులైన అలయన్స్‌ కమాండర్లు చెబుతున్నారు.

కాగా రబ్బానీ అనుకూల సైనికులు మాత్రం దూకుడుగా కుందుజ్‌లోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం అందింది. అలయన్స్‌ నేతల్లో పొడసూపిన భేదాలతో ఇక్కడ పరిస్థితిలో గందరగోళం నెలకొన్నది. మరోవైపు ఇప్పటికే పెద్ద సంఖ్యలో తాలిబన్‌ యోధులు ఆయుధాలు అప్పగించి లొంగిపోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. లొంగిపోయినా తమ ప్రాణాలు దక్కడం కష్టమన్న భయంతో వున్న అరబ్‌, ఉజ్బెక్‌, చెచన్యా, పాకిస్తాన్‌కు చెందిన తాలిబన్‌ అనుకూల సైనికులు కడదాకా పోరాడేందుకు సిద్ధపడటంతో లొంగుబాటు పర్వం సవ్యంగా సాగడం లేదని అంటున్నారు. dరందరి ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వాలని అలయన్స్‌ సేనానుల్ని ఐక్యరాజ్యసుతి కోరుతున్నది. అమెరికా మాత్రం తన మానాన తాను బాంబుదాడులను కొనసాగిస్తూనే వుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+