హైదరాబాద్‌ః కాంగ్రెస్ పార్టీని జనం పట్టించుకోవడం మానేశారని హోం మంత్రి దేవేందర్‌గౌడ్ చెప్పారు. శనివారం నాడు ఎన్‌టిఆర్ భవన్‌లో కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన 14 నియోజకవర్గాల తెలుగుదేశం నేతల శిక్షణ తరగతులకు ఆయన ప్రారంభోత్సవం చేశారు.
వరసగా చేపడుతున్న నియోజకవర్గ స్థాయి నేతల శిక్షణాశిబిరాల్లో ఇది మూడోది. కాంగ్రెస్ నేతలు అదేపనిగా తెలుగుదేశం పార్టీని మర్శిస్తూ కాలం గడుపుతున్నారని వారికి మరో పని లేకుండా పోయిందని దేవేందర్‌గౌడ్ అన్నారు. తెలుగుదేశంపై దుమ్మెత్తిపోయడం మాని సొంతపార్టీ బలం పెంచుకోవడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నించడం మంచిదని ఆయన సలహా ఇచ్చారు. పరిపాలనలో తెలుగుదేశం పార్టీ ఒక కొత్త వరవడి సృష్టించిందని ఆయన చెప్పారు. పాలనను ప్రజలకు మరింత చేరువగా తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని ఆయన చెప్పారు. పార్టీ సేవలను ప్రజలకు వరించి కాంగ్రెస్ ఇతర పక్షాలు చేసే దుష్ప్రచారాన్ని ఎండగట్టాలని పార్టీ నాయకులను దేవేందర్‌గౌడ్ కోరారు.












Click it and Unblock the Notifications
