హైదరాబాద్‌ః కృషి బాంకు డిపాజిటర్లకు ఈ నెల 27వ తేదీనుంచి వారి డిపాజిట్లను వాపస్ చేయనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. లక్ష రూపాయల లోపు డిపాజిట్లు వున్న ఖాతాదారులకు చెల్లించేందుకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ 25 కోట్ల 47 లక్షల రూపాయలు చెల్లించడానికి అంగీకరించింది.
అందులో భాగంగా తొలిడతగా 15 కోట్లరూపాయలను డుదలచేసింది. మంగళవారం నుంచి డిపాజిట్ దారులకు చెల్లింపులు మొదలుపెట్టనున్నట్టుగా ప్రభుత్వం వెల్లడించింది. మొదట అయిదు పదివేల రూపాయల చిన్నమొత్తాలున్న డిపాజిటర్ల డబ్బులు తిరిగి చెల్లిస్తారు. ఆ తర్వాత పెద్దమొత్తాల్లో డిపాజిట్లు వున్నవారికి డబ్బులు తిరిగి చెల్లిస్తారు.












Click it and Unblock the Notifications
