కుందుజ్‌ను ఖాళీ చేస్తున్న తాలిబాన్లు
కాబూల్: తాలిబాన్లు కుందుజ్‌ను ఖాళీ చేస్తున్నారు. దాదాపు 1,700 మంది తాలిబాన్‌సైనికులు శనివారం నార్తర్న్ అలయెన్స్‌కు లొంగిపోయారు. తాలిబాన్లు శనివారం ఉదయం 11 గంటలకు కుందుజ్ నుంచి వెళ్లిపోవడం మొదలుపెట్టారు.
వేయి మంది తాలిబాన్‌సైనికులు ఆయుధాలను వదలిపెట్టి సరెండర్ అయ్యారని నార్తర్న్ అలయెన్స్ కమాండర్లకు లొంగిపోయారని అలయెన్స్‌సైనిక అధిపతి జనరల్ మహ్మద్ ఖాసీంఫహీమ్ అధికార ప్రతినిధి మొహమ్మద్ హబీల్ చెప్పారు. మరో ఏడు వందల మంది తాలిబాన్‌సైనికులు కమాండర్ మొహ్మద్ దావూద్ దావూద్‌కు లొంగిపోయినట్లు ఆయన తెలిపారు.
ఒసామా బిన్ లాడెన్‌తో సంబంధాలున్న పాకిస్థాన్ అతివాదులు,అరబ్బులు, చెచెన్స్‌లతో పాటు దేశీ ఫైటర్స్ లొంగిపోగలరని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.
కుందుజ్ ఇంకా తమ స్వాధీనం కాలేదని, అయితే తమ బలగాలు ముందుకు సాగుతున్నాయని నార్తర్న్ అలయెన్స్ దేశాంగ మంత్రి అబ్దుల్లా అబ్దుల్లా చెప్పారు. లొంగిపోవడానికి తాలిబాన్లకు అవకాశం ఇచ్చామని, ఈ అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. కుందుజ్‌లో జనసాంద్రత ఎక్కువని,అందువల్ల జన నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో శాంతియుతంగాస్వాధీనం చేసుకునే అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
