నేపాల్‌లో మావోయిస్టుల హింసాకాండ
ఖాట్మాండుః నేపాల్‌లో మావోయిస్టు తీవ్రవాదులు చెలరేగి సృష్టించిన హింసాకాండకు భద్రతాసిబ్బందితో సహా 34మంది బలయ్యారు. సాంగ్యా జిల్లాలో ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన హెలికాప్టర్‌ను శుక్రవారం రాత్రి తీవ్రవాదులు పేల్చివేశారు.
ఈ సంఘటనలో 9 మంది అక్కడికక్కడే మరణించారు. మరో రెండు హెలికాప్టర్లు కూడా ఈ
సంఘటనలో దెబ్బతిన్నాయి. డాంగ్ జిల్లాలో సైనిక పోస్ట్‌పై పెద్దసంఖ్యలో మావోయిస్టు తీవ్రవాదులు దాడి జరిపి ఒక మేజర్‌తో సహా 11 మంది సైనికులను హతమార్చారు.
స్యాంగ్యా జిల్లా పోలీసు ప్రధాన కేంద్రంపై వెయ్యిమంది సాయుధ తీవ్రవాదులు మెరుపు దాడి జరిపి మరో 14 మంది పోలీసులను పొట్టనబెట్టుకున్నారు. ఈ దాడిలో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. డాంగ్‌లో జిల్లా అధికారి కార్యాలయాన్ని, జిల్లా పోలీసుల ప్రధానకార్యాలయాన్ని పేల్చివేయడంతో పాటు చీఫ్ డిస్ట్రిక్ట్ అధికారిని కిడ్నాప్ చేశారు. పర్వత్, గోర్ఖా వంటి కేంద్రాలు కూడా బాంబు పేలుళ్లతో కంపించిపోయాయి. స్యాంగ్యాలో నేపాల్‌బాంకును, వ్యవసాయ బాంకును పదికోట్ల రూపాయలమేర దోచుకున్నారు కూడా.












Click it and Unblock the Notifications
