నిజాం నగలు హైదరబాద్‌లోనే వుండాలి
హైదరాబాద్: నిజాం ఆభరణాలనుశాశ్వతంగా హైదరాబాద్‌లోనే ప్రదర్శించే ఏర్పాట్లకు కృషి చేస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. నిజాం ఆభరణాల ప్రదర్శనను గవర్నర్‌సి. రంగరాజన్ శనివారం ఇక్కడి సాలార్‌జంగ్ మ్యూజియంలో ప్రారంభించారు. ఈ ప్రదర్శన రెండు నెలల పాటు వుంటుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాట్లాడారు.
నిజాంకు చెందిన ఆభరణాలు హైదరాబాద్‌కు సంబధించినవని, వాటి ప్రదర్శన ఇక్కడ వుంటేనే దాని ప్రభావం ఎక్కువగా వుంటుందని, మరో చోట ఈ ఆభరణాల ప్రదర్శన వుంటే ఇంత ప్రభావం వుండదని ఆయన అన్నారు. నిజాం ఆభరణాల ప్రదర్శనశాశ్వతంగా హైదరాబాద్‌లోనే వుండాలని తాను పదే పదే ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయిని కోరుతున్నానని ఆయన చెప్పారు.
19వ శతాబ్ది నుంచి 20 శతాబ్ది ప్రారంభం వరకు సంబంధించిన నిజాం ఆభరణాలుఅరుదైనవని, అమూల్యమైనవని, ఈ ఆభరణాలు జాతి సంపద అని గవర్నర్ రంగరాజన్ అన్నారు. భవనాలు, మసీదులు, దేవాలయాలు, చారిత్రక కట్టడాలు ప్రస్తుత సమాజానికి గతంతో గల అన్యోన్య సంబంధానికి సేతువులని ఆయన అన్నారు. ఈ సమావేశానికి నిజాం కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులుహాజరయ్యారు. నిజాం నగల ఆభరణాల ప్రదర్శనను ముఖ్యమంత్రి, గవర్నర్ తిలకించారు.












Click it and Unblock the Notifications
