హైదరాబాద్‌: మంత్రి పునర్వ్యస్థీకరణ అనంతరం తెలుగుదేశం శాసనసభ్యుల్లో అసంతృప్తి నెలకొన్నదనేది మీడియా సృష్టేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఎక్కడండి పొగలు,సెగలు? 190 మంది శాసనసభ్యుల్లో ఒకరిద్దరు చెప్పిందే రాస్తారు. 140 మంది చెప్పింది రాయరు అని ఆయన పత్రికలపై రుసరుసలాడారు.కృష్ణాయాదవ్‌ అభిప్రాయం కనుక్కోండి. ఆయనేమంటారో రాయండి. ఆయన అభిప్రాయం ఎందుకు కనుక్కోరు? అని చంద్రబాబు మీడియా ప్రతినిధులమీద విరుచుకుపడ్డారు.

తెలుగుదేశం శాసనసభ్యుల్లో అసంతృప్తి చెలరేగిందనేది వట్టి మాట అని ఆయన మంగళవారంవిలేకరులతో అన్నారు. మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణపై తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేయడం సరికాదని ఆయన తెలుగుదేశం నాయకులకు సలహా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి శిక్షణా శిబిరాల ముగింపు సమావేశంలో ఆయన ఈ సలహా ఇచ్చారు. క్రమశిక్షణకు ఎవరూ అతీతులు కారని ఆయన అన్నారు.

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) నుంచి ప్రభుత్వం తెస్తున్నఅప్పుల విషయంలో వామపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని, కరెంట్‌విషయంలో కాంగ్రెస్‌ తప్పుడు ప్రకటనలు చేస్తోందని ఆయనవిమర్శించారు. ప్రతిపక్షాలు విమర్శలను తిప్పికొట్టాలని ఆయన తెలుగుదేశం నాయకులకు పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+