సెంచూరియన్‌ పార్క్‌: దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు భారత జట్టుపై సునాయసవిజయం సాధించింది. ఇన్నింగ్స్‌ 73 పరుగులతో తేడాతో భారత జట్టు దక్షిణాఫ్రికా చేతిలో మట్టి కరిచింది. మొదటి ఇన్సింగ్స్‌లో 133 పరుగులతోసెంచరీ చేసి రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీసుకున్న షాన్‌ పొలాక్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

సిరీస్‌ కూడా దక్షిణాఫ్రికా వశమైంది. మూడో టెస్టువిషయంలో వివాదం వున్నప్పటికీ మొదటి టెస్టు మ్యాచ్‌ గెలిచిన దక్షిణాఫ్రికా సిరీస్‌నుకైవసం చేసుకున్నట్లయింది. రెండో టెస్టు డ్రాగా ముగిసింది. సిరీస్‌లోవిశేష ప్రతిభ కనబరిచిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ గిబ్స్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది సరీస్‌గా ఎంపికయ్యాడు.

వివాదాస్పద మూడో టెస్టులో భారత బ్యాట్స్‌మన్‌, బౌలర్లువిఫలమయ్యారు. మొదటి ఇన్సింగ్స్‌లో భారత్‌ 232 పరుగులు మాత్రమే చేయగలిగింది. దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్‌ను 8వికెట్లు కోల్పోయి 566 పరుగులు చేసి డిక్లేర్‌ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లువిలియమ్స్‌, శివసుందర్‌ దాస్‌ గుప్తా మంచి ప్రారంభాన్నిఅందించినప్పటికీ ఆ తర్వాత ఏ ఒక్క బ్యాట్స్‌మన్‌ కూడా దక్షిణాఫ్రికా బౌలర్లు ముందు నిలదొక్కుకోలేకపోయారు. 261 పరుగులకు ఎనిమిదివికెట్లు కోల్పోయి భారత్‌ ఓటమిని అంగీకరించింది.

గాయాల కారణంగా వెంకటేష్‌ ప్రసాద్‌, శ్రీనాథ్‌ బ్యాటింగ్‌ చేయలేదు. మంగళవారంనాడు బ్యాటింగ్‌ ప్రారంభించిన ద్రావిడ్‌ 23 పరుగులకే ఔటయ్యాడు. సచిన్‌ టెండూల్కర్‌ 40 పరుగులు చేసిపెవిలియన్‌ దారి పట్టాడు. హర్బజన్‌ సింగ్‌ మంచి బ్యాటింగ్‌ ప్రతిభ ప్రదర్శించి 30 పరుగులు చేసి ఔటయ్యాడు. దక్షిణాఫ్రికా బౌలర్లు పొలాక్‌, హేవార్డ్‌, నితిని రెండేసివికెట్లు తీసుకున్నారు. క్లుసెనర్‌, కల్లీస్‌ చెరోవికెట్‌ తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+