విశాఖపట్నం: తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేతకె. ఎర్రంనాయుడిపై తెలుగుదేశం శాసనసభ్యుడు దాడి వీరభద్రరావు తీవ్రంగా ధ్వజమెత్తారు. మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణలో ఉత్తరాంధ్రకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకుస్వేచ్ఛ లేకుండా ఎర్రంనాయుడు చేశారని ఆయన మంగళవారంవిలేకరుల సమావేశంలో ధ్వజమెత్తారు. మంత్రి వర్గంలో తనకు ఎర్రంనాయుడు వల్లనే స్థానం లభించలేదనే ఉద్దేశంతో దాడి వీరభద్రరావు ఆయనపై తీవ్ర స్థాయిలోవిమర్శనాస్త్రాలు సంధించినట్లు కనిపిస్తోంది.
ఎర్రంనాయుడి వల్లనే ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ పూర్తిగాదెబ్బ తిన్నదని దాడి వీరభద్రరావు అన్నారు. ఎర్రంనాయుడు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని,సూపర్ సిఎంగా ప్రవర్తిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.సిఎంకు నేనే చెప్పాను, ఈ పేరు తీసేయాలని, ఈపేరు చేర్చాలని అని ఎర్రంనాయుడు ఫోన్‌లో చాలా మందికి చెప్పారని, ఎర్రంనాయుడు అలా చెప్పినట్లు తాను రుజువు చేయగలనని ఆయన అన్నారు.
మామూలుగా గ్రూప్ రాజకీయాలపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తాం. ముఖ్యమంత్రి ఆవివాదాన్ని సమన్వయ కమిటీకి సిఫార్సు చేస్తారు. సమన్వయ కమిటీలో ఎవరుంటారు. ఎర్రంనాయుడే ఉంటారు. గ్రూప్ రాజకీయాలు నడిపే ఆయనే వున్న తర్వాత ఇక న్యాయం ఎలా జరుగుతుంది? అని దాడి వీరభద్ర రావు మండిపడ్డారు.












Click it and Unblock the Notifications
